🔥 "OpenAIపై భారీ కేసు! ChatGPT చేసిన తప్పేంటి?"

🔥 "OpenAIపై భారీ కేసు! ChatGPT చేసిన తప్పేంటి?"



 OpenAI పై Florida రాష్ట్రం వేసిన కేసు ఏమిటి?

ఓపెన్ ai పైన మొదటి కేసు అయితే నమోదు అయింది. 

జూన్ 1, 2026న ఏకంగా అమెరికాలోని ఫ్లోరిడా ప్రభుత్వం  OpenAI మరియు CEO Sam Altman పై సివిల్ కేసు దాఖలు చేసింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం OpenAIపై నేరుగా కేసు వేయడం ఇదే మొదటిసారి. 


Florida రాష్ట్రం open ai ఫై ఏమి ఆరోపిస్తోంది. అనేది చూదాం. 


Florida Attorney General James ఉత్మేయర్ తెలిపిన వివరాల ప్రకారం: ChatGPTలో ఉన్న ప్రమాదాల గురించి OpenAIకి ముందే తెలిసినప్పటికి.  ChatGPTను "సురక్షితమైనది" అని ప్రచారం చేసింది. చిన్న పిల్లలకు తగిన రక్షణ చర్యలు అమలు చేయలేదని ఆరోపిస్తోంది.

ChatGPT కొన్నిసార్లు హింస, ఆత్మహత్య, ప్రమాదకర ప్రవర్తనలకు సంబంధించిన సూచనలు ఇచ్చిందని చెబుతోంది. Florida State University షూటింగ్ కేసులో నిందితుడు ChatGPTను ఉపయోగించాడని కూడా కేసులో ప్రస్తావించింది.  ఇంత తెలిసి నాకుండా ఎలాంటి చర్యలు తీసుకోలేశు అని ప్రభుత్వం వదిస్తుంది.


ఫ్లోరిడా యొక్క డిమాండ్ ఏంటో చూదాం.

OpenAI నుంచి భారీ నష్టపరిహారం (బిలియన్ల డాలర్లు) కోరుతోంది. పిల్లల భద్రత కోసం మరింత కఠినమైన నియమాలు అమలు చేయాలని కోరుతోంది.

Sam Altmanను వ్యక్తిగతంగా కూడా బాధ్యుడిగా పరిగణించాలని ప్రయత్నిస్తోంది.


దీనికి సమాదానంగా OpenAI ఏమంటోంది అనేది చూదాం.

అసలు OpenAI ఈ ఆరోపణలను అంగీకరించలేదు.

ఓపెన్ ai ప్రకారం:ChatGPT హింస లేదా హానికరమైన చర్యలను ప్రోత్సహించకుండా రూపొందించబడింది.

ప్రమాదకర ప్రశ్నలను గుర్తించేందుకు భద్రతా వ్యవస్థలు ఉన్నాయి. పిల్లల కోసం అదనపు రక్షణ ఫీచర్లు ఇప్పటికే అమల్లో ఉన్నాయని చెబుతోంది. 


ఈ కేసు ఎందుకు ముఖ్యమైనది?

ఈ కేసు కేవలం OpenAI గురించే కాదు. AI కంపెనీలు తమ ఉత్పత్తుల వల్ల జరిగే నష్టాలకు ఎంతవరకు బాధ్యత వహించాలి అనే పెద్ద ప్రశ్నకు ఇది పరీక్షగా మారవచ్చు. Florida గెలిస్తే, ఇతర రాష్ట్రాలు కూడా AI కంపెనీలపై ఇలాంటి కేసులు వేసే అవకాశం ఉంది.


ఒక లైన్‌లో చెప్పాలంటే:

Florida ప్రభుత్వం "ChatGPT ప్రజలకు, ముఖ్యంగా పిల్లలకు ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయని తెలిసినా OpenAI తగిన జాగ్రత్తలు తీసుకోలేదు" అని ఆరోపిస్తూ కేసు వేసింది.


చూసారు కదా మామ. ఫైనల్ గా ఇలా జరుగుతుంది. మరి దీని గురుంచి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చెయ్యండి.

Post a Comment

0 Comments