₹15 వేల లోపల బెస్ట్ మొబైల్స్ – ఏది కొంటే పైసలు వృథా కావు

 

₹15 వేల లోపల బెస్ట్ మొబైల్స్ – ఏది కొంటే పైసలు వృథా కావు?



ఇప్పుడున్న టైంలో ₹15 వేల బడ్జెట్‌లో కూడా అదిరిపోయే 5G మొబైల్స్ వస్తున్నయ్. కానీ ఏది పడితే అది కొనేస్తే తర్వాత "అరే... ఇంకొంచెం చూసి తీసుకోవాల్సింది" అనిపిస్తది. అందుకే మీ కోసం బెస్ట్ ఆప్షన్స్ తీసుకొచ్చాం.

1. POCO M7 Pro 5G – గేమింగ్ అంటే ఇదే మామూలు కాదు



ధర: సుమారు ₹14,999

ఎందుకు తీసుకోవాలంటే?

  • పర్ఫార్మెన్స్ అదిరిపోతది.
  • గేమ్స్ స్మూత్‌గా ఆడొచ్చు.
  • బ్యాటరీ కూడా బాగానే నిలుస్తది.

ఎవరికి బాగుంటది? రోజంతా PUBG, Free Fire లాంటి గేమ్స్ ఆడే వాళ్లకి.

2. Moto G45 5G – క్లీన్ ఆండ్రాయిడ్ కావాలంటే ఇదే



ధర: ₹11,000 – ₹12,500

హైలైట్స్:

  • స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవం.
  • అవసరం లేని యాప్స్ ఉండవు.
  • మంచి బ్యాటరీ బ్యాకప్.

ఎవరికి? సింపుల్‌గా, ల్యాగ్ లేకుండా ఫోన్ వాడాలనుకునే వాళ్లకి.

3. Samsung Galaxy M17 5G – నమ్మకం ఉన్న బ్రాండ్



ధర: సుమారు ₹14,500

హైలైట్స్:

  • Super AMOLED డిస్ప్లే.
  • సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ బాగుంటయ్.
  • కెమెరా కూడా ఓకే.

ఎవరికి? "ఒకసారి కొంటే నాలుగేళ్లు వాడాలి" అనుకునే వాళ్లకి.

4. Vivo T4 Lite 5G – కెమెరా కోసం



ధర: ₹13,000 – ₹14,000

ఎందుకు కొనాలి?

  • ఫోటోలు బాగొస్తయ్.
  • డిజైన్ కూడా స్టైలిష్‌గా ఉంటది.
  • బ్యాటరీ లైఫ్ మంచిగుంటది.

ఎవరికి? సెల్ఫీలు, రీల్స్, ఫోటోగ్రఫీ అంటే ఇష్టమున్న వాళ్లకి.

5. OPPO K14x 5G – బ్యాటరీ బాస్



ధర: ₹14,999

హైలైట్స్:

  • 6000mAh బ్యాటరీ.
  • 45W ఫాస్ట్ ఛార్జింగ్.
  • 120Hz డిస్ప్లే.

ఎవరికి? రోజంతా ఫోన్ చేతిలోనే ఉండే వాళ్లకి.

మరి ఏది కొనాలి?

👉 గేమింగ్ కోసం: POCO M7 Pro 5G
👉 క్లీన్ ఆండ్రాయిడ్ కోసం: Moto G45 5G
👉 బ్రాండ్ నమ్మకానికి: Samsung Galaxy M17 5G
👉 కెమెరా కోసం: Vivo T4 Lite 5G
👉 బ్యాటరీ కోసం: OPPO K14x 5G

చివరగా...

₹15 వేల లోపల ఫోన్ కొంటున్నాం కదా అని ఏది పడితే అది తీసుకోవద్దు. మీకు ఏది ముఖ్యం – గేమింగ్ ఆ? కెమెరా ఆ? బ్యాటరీ ఆ? లేక ఎక్కువ రోజులు వాడుకోవడమా? అది చూసుకుని ఫోన్ తీసుకుంటేనే మీ డబ్బులకు పూర్తి విలువ దొరుకుతది.

మరి మీకు ఈ లిస్ట్‌లో ఏ మొబైల్ నచ్చింది? కామెంట్ చేసి చెప్పండి!

Post a Comment

0 Comments